Home న్యూస్ డార్లింగ్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్….టార్గెట్ పెద్దదే…వచ్చింది ఇదే!

డార్లింగ్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్….టార్గెట్ పెద్దదే…వచ్చింది ఇదే!

0
Darling(2024) Movie 2 Days Total World Wide Collections Report
Darling(2024) Movie 2 Days Total World Wide Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రియదర్శి(Priyadarshi) మరియు నభా నటేష్(Nabha Natesh) ల కాంబినేషన్ లో రూపొందిన డార్లింగ్(Darling Movie 2 Days Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో బిజినెస్ పరంగా బాగానే జోరు చూపించిన ఈ సినిమా 7 కోట్ల దాకా రేటుని సొంతం చేసుకుని 7.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా…

మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరుని అయితే చూపించ లేక పోయిన ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెండో రోజు సినిమా మరీ హెవీ డ్రాప్స్ ని సొంతం చేసుకోలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తూ మరోసారి 5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 35 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 2 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు…80 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది…

ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 7.50 కోట్ల దాకా ఉండగా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 6.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాకి టాక్ కొంచం పాజిటివ్ గా వచ్చి ఉంటే కలెక్షన్స్ పరంగా ఇంకా బెటర్ గా పెర్ఫార్మ్ చేసి ఉండేది కానీ మిక్సుడ్ టాక్, వర్షాలు అలాగే..

కల్కి మూవీ ఇప్పటికీ జోరు చూపించడంతో డార్లింగ్ మూవీ కి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఇక సినిమా లాంగ్ రన్ లో సాలిడ్ గా గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా 3వ రోజు సండే ఎలాంటి కలెక్షన్స్ ని ఇప్పుడు సినిమా సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తి గా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here