బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా అన్ని చోట్లా మరీ అంచనాలను అందుకోలేక పోయినా కూడా హిందీ లో మాత్రం అనుకున్న ఎక్స్ పెర్టేషన్స్ కన్నా కూడా బెటర్ గా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…
6-8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా ఈ అంచనాలను మించి పోయిన సినిమా 8.64 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది….దాంతో రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ లో ఎన్టీఆర్(Jr NTR) నటించిన దేవర(Devara Movie) డే కలెక్షన్స్ ని బీట్ చేసింది…
దేవర మొదటి రోజు 7.95 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే గేమ్ చేంజర్ 8.64 కోట్లతో దేవరని హిందీలో కొట్టింది…కానీ రెండో రోజు బుకింగ్స్ ట్రెండ్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ ఓవరాల్ గా డే 2 కలెక్షన్స్ మొదటి రోజు మించి ఉంటాయి అనుకున్నా అలా ఏమి జరగలేదు…
ఓవరాల్ గా రెండో రోజు హిందీ లో 8.43 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా దేవర రెండో రోజు మాత్రం మంచి గ్రోత్ ని చూపించింది…ఓవరాల్ గా రెండో రోజు దేవర 9.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది….మొత్తం మీద 2 డేస్ కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ హిందీ కలెక్షన్స్ ని చూసుకున్నా…
గేమ్ చేంజర్ మీద దేవరనే లీడ్ ఉంది హిందీలో….2 రోజుల్లో గేమ్ చేంజర్ హిందీలో 17.07 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే దేవర మూవీ రెండో రోజు లీడ్ ని చూపించడంతో 2 రోజుల్లో 17.45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని కుమ్మేసింది…..ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో దేవర …
సాలిడ్ గా జోరు చూపించింది…మరి గేమ్ చేంజర్ మిగిలిన చోట్ల ఎలా ఉన్నా కూడా హిందీలో బాగానే హోల్డ్ చూపిస్తూ ఉండటంతో హిందీలో ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో దేవరని అందుకునే ప్రయత్నం ఎంతవరకు చేస్తుందో చూడాలి ఇప్పుడు…