బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా, మొదటి రోజున అంచనాలను అందుకోలేక పోయిన సినిమా హిందీ లో మాత్రం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపించింది కానీ…
మిగిలిన చోట్ల మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేదు…ఇక రెండో రోజు సినిమా డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకున్నా కూడా హిందీ లో పర్వాలేదు అనిపించగా తెలుగు లో అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…తెలుగు రాష్ట్రలలో ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
10 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా ఓవరాల్ గా 8.24 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….ఇక వరల్డ్ వైడ్ గా సినిమా డీసెంట్ హోల్డ్ ని చూపెడుతుంది అనుకున్నా ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ పడటంతో కలెక్షన్స్ పై ఇంపాక్ట్ పడగా….
ఓవరాల్ గా 2 రెండో రోజు వరల్డ్ వైడ్ గా 16.19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 32.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…ఓవరాల్ గా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
Game Changer 2 Days Total World Wide Collections Report
👉Nizam: 13.96CR
👉Ceeded: 7.69CR
👉UA: 6.82CR
👉East: 5.41CR
👉West: 2.72CR
👉Guntur: 4.86CR
👉Krishna: 3.62CR
👉Nellore: 2.68CR
AP-TG Total:- 47.76CR(66.05CR~ Gross)
👉KA: 3.60Cr
👉Tamilnadu: 2.30Cr
👉Kerala: 20L~
👉Hindi+ROI: 8.15Cr
👉OS – 10.60Cr****approx
Total WW Collections: 72.61CR(Gross- 125.10CR~)
(32%+ Recovery)
సినిమా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం మరో 150.39 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…. ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.