బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ మూవీ తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ జాక్(Jack Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద డీసెంట్ అనిపించే రేంజ్ లో అంచనాలు ఉన్నా కూడా రిలీజ్ అయిన…
మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఓపెనింగ్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. దాంతో టిల్లు స్క్వేర్ లాంటి మూవీ తర్వాత తీవ్రంగా నిరాశ పరిచే డే 1 కలెక్షన్స్ ని అందుకోగా రెండో రోజు కూడా పెద్దగా ఇంపాక్ట్ ని..
ఏమి చూపించ లేక పోయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 75 లక్షల రేంజ్ లో షేర్ ని 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని మాత్రమే సొంతం చేసుకుని ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది.
ఇక టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
JACK Movie 2 Days WW Collections
👉Nizam – 85L~
👉Ceeded – 22L
👉Andhra – 65L~
AP-TG Total – 1.75CR~(3.30CR~ GROSS)
👉KA+ROI+OS- 90L***Approx
Total World Wide Collections: 2.65CR~(5.30CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మూడో రోజు నుండి అయినా ఏమైనా జోరు ని చూపిస్తుందో లేదో చూడాలి.