బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో రోజు కూడా అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపే రేంజ్ లో…
వసూళ్ళ జోరుని చూపించింది. వారం నుండే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో మాస్ రచ్చ చేసిన సినిమా వీకెండ్ మొత్తానికి ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను దక్కించుకోగా రెండో రోజు కూడా ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను అందుకుంది. మేజర్ గా నైజాంలో సినిమా ఊరమాస్ హోల్డ్ ని చూపించి దుమ్ము లేపగా…
ఓవరాల్ గా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకున్న ఖలేజా సినిమా ఏకంగా 1.8 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేసిన సినిమా 2 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది.
దాంతో ఓవరాల్ గా 2 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Khaleja4K Movie Re Release 2 Days Box Office Collections(INC Premieres)
👉Nizam: 4.40Cr~
👉Ceeded: 46L~
👉Andhra: 2.30Cr~
AP-TG Total Collections – 7.16CR~ GROSS
👉KA+ROI: 60L~
👉OS: 1.14Cr~….Approx
Total World Wide: 8.90CR~ GROSS
మొత్తం మీద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఖలేజా సినిమా వీకెండ్ లో ఊహకందని రికార్డులను నమోదు చేస్తూ టాలీవుడ్ రీ రిలీజ్ లలో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేయడానికి సిద్ధం అవుతుంది. ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.