Home న్యూస్ 2 డేస్ కృష్ణమ్మ టోటల్ కలెక్షన్స్…డే 2 లెక్క పెరిగిందిగా!!

2 డేస్ కృష్ణమ్మ టోటల్ కలెక్షన్స్…డే 2 లెక్క పెరిగిందిగా!!

0

సత్యదేవ్(Satyadev)….హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ(Krishnamma Movie 2 Days Collections) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ అయితే సొంతం అయింది. కానీ పొలిటికల్ హీట్ లో సినిమా కి అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ మొదటి రోజు సొంతం అవ్వలేదు.

సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 5.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ జరగా రెండో రోజుకి వచ్చేసరికి లెక్క పెరిగింది. మొత్తం మీద 8.3 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

దాంతో టోటల్ గా సినిమా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో షేర్ ని 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. మొత్తం మీద రెండో రోజు సినిమా డీసెంట్ గ్రోత్ ని అయితే చూపించింది.

సినిమా బాక్స్ ఆఫీస్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల రేంజ్ లో ఉండగా రెండు రోజుల్లో 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఇంకా 2.15 కోట్లకు పైగా షేర్ ని లాంగ్ రన్ లో అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇలానే స్టడీగా లాంగ్ రన్ ని సినిమా కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ కి అవకాశం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here