కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) కుబేర(Kuberaa Movie) సినిమా, రిలీజ్ కి ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నా యునానిమస్ పాజిటివ్ టాక్ భారీగా హెల్ప్ చేసి మొదటి రోజున ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసింది అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 11.8 కోట్ల రేంజ్ లో..
గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా రికార్డులు క్రియేట్ చేస్తూ 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక రెండో రోజున ఒక్క తమిళనాడు లో మాత్రం స్లైట్ గా డ్రాప్ అయిన సినిమా మిగిలిన చోట్ల మాత్రం ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి మాస్ రచ్చ చేసింది…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజున అటూ ఇటూగా 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా రెండో రోజున 4 కోట్లు ఆ పైన గ్రాస్ ను….
అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అక్కడ ఆఫ్ లైన్ లెక్కలు ఏమైనా గ్రోత్ ని చూపిస్తే కలెక్షన్స్ కొంచం పెరగవచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మంచి జోరు ని చూపెడుతున్న సినిమా 2.2-2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా…
ఇండియాలో సినిమా ఓవరాల్ గా 14-15 కోట్ల మధ్యలో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సినిమా ఓవర్సీస్ లో మరొసారి మంచి జోరు ని చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా రెండో రోజున 18-20 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా వసూళ్ళని అందుకునే అవకాశం కనిపిస్తుంది.
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక సినిమా రెండు రోజులు కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 48-50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఫైనల్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరగవచ్చు. ఇక టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…