Home న్యూస్ లవ్ మౌళి-సత్యభామ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్…ఈ సినిమా కలెక్షన్స్ పెరిగాయి!

లవ్ మౌళి-సత్యభామ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్…ఈ సినిమా కలెక్షన్స్ పెరిగాయి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమాలు నవదీప్(Navadeep) నటించిన లవ్ మౌళి(Love Mouli Movie 2 Days Collections) కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ సత్యభామ(Satyabhama Movie 2 Days Collections)సినిమాలు లిమిటెడ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో డీసెంట్ రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి.

మొదటి రోజు కలెక్షన్స్ పరంగా లవ్ మౌళి మూవీ కేవలం 15 లక్షల లోపే గ్రాస్ ను అందుకోగా రెండో రోజు కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ను ఈ సినిమా అయితే చూపించలేదు, టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్ ఆడియన్స్ కూడా రెండో రోజున సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో టోటల్ గా 2 రోజుల సినిమా కలెక్షన్స్ లెక్క వరల్డ్ వైడ్ గా 25 లక్షల లోపే గ్రాస్ ఉంటుందని అంచనా…

ఇక కాజల్ నటించిన సత్యభామ సినిమా మొదటి రోజున 20 లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా రెండో రోజు సినిమా కొంచం గ్రోత్ ని చూపించింది. 24 లక్షల రేంజ్ దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సినిమా సొంతం చేసుకున్నట్లు అంచనా…వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 28 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా ఉంటుందని అంచనా వేస్తుండగా….

టోటల్ గా 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ 44 లక్షల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 50 లక్షల రేంజ్ దాకా ఉంటుందని అంచనా…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అయింది అని అనిపించుకోవాలి అంటే 2 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. రెండో రోజు గ్రోత్ ని చూపించడంతో…

వీకెండ్ లో స్టడీ కలెక్షన్స్ ని అందుకుని తర్వాత వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే పర్వాలేదు అనిపించవచ్చు. ఇక లవ్ మౌళి మాత్రం మొదటి రోజే ఫేట్ డిసైడ్ అవ్వగా ఇక తేరుకునే అవకాశం తక్కువే. ఇక వీకెండ్ లో ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here