బాక్స్ ఆఫీస్ దగ్గర బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన రెండో సినిమా నేను స్టూడెంట్ సర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాలో కోర్ పాయింట్ బాగున్నప్పటికీ కూడా ఓవరాల్ గా మూవీకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సాధించగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు వర్త్ షేర్…
15 లక్షల రేంజ్ లో ఉండగా రెండో రోజు సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 24 లక్షల లోపు గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్నట్లు ట్రేడ్ సమాచారం.
దాంతో టోటల్ గా సినిమా 2 రోజుల్లో టోటల్ గా 60 లక్షల లోపు గ్రాస్ ను సినిమా సొంతం చేసుకుందని చెప్పొచ్చు. అందులో నుండి వర్త్ షేర్ 25 లక్షల నుండి 27 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా. సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 2.3 కోట్ల దాకా ఉండగా సినిమా…
2.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. కానీ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.2 కోట్ల కు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.