బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాలలో హ్యూ టికెట్ హైక్స్ వలన కొంచం డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా మిగిలిన చోట్ల మాత్రం సినిమా సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతుంది..
ముఖ్యంగా హిందీ మార్కెట్ లో సినిమా బాక్స్ ఆఫీస్ రాంపెజ్ మరో లెవల్ లో దూసుకు పోతుంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ మాస్ రచ్చ చేస్తున్న సినిమా…నార్మల్ వర్కింగ్ వీకెండ్ లో ఊహకందని వసూళ్ళతో మెంటల్ మాస్ జాతర సృష్టిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి..
ఓవరాల్ గా సినిమా మొదటి రోజు హిందీలో ఏకంగా 72 కోట్ల నెట్ కలెక్షన్స్ తో హిస్టారికల్ రికార్డ్ ను సృష్టించింది….ఇక రెండో రోజు వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా అనుకున్న అంచనాలను మించి పోయే రేంజ్ లో హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి…
మొత్తం మీద రెండో రోజు సినిమా అంచనాలను మించి పోయి 59 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుటూ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డుల జాతర సృష్టించడానికి సిద్ధం అవుతూ ఉంది. మొత్తం మీద రెండు రోజుల్లో సినిమా హిందీ లో ఇప్పుడు ఏకంగా…
131 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇదే రేంజ్ లో వీకెండ్ మొత్తం జోరు చూపించే అవకాశం ఉన్న సినిమా లాంగ్ 4 డేస్ వీకెండ్ లోనే హిందీ లో 250 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అవలీలగా అందుకునే అవకాశం మించి పోయే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.