బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ, మంచి ప్రమోషన్స్ ను జరుపుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను…
ఏమి చూపించ లేక పోతుంది. మొదటి రోజు కలెక్షన్స్ నుండే పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా పోటిలో ఉన్న ఇతర సినిమాల ఇంపాక్ట్ వలన కూడా కలెక్షన్స్ ఏమాత్రం బాలేదు… ఓవరాల్ గా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1 కోటి రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం ఉందని అనుకున్నా కూడా ఓవరాల్ గా 1.22 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని పర్వాలేదు అనిపించగా వరల్డ్ వైడ్ గా 1.4 కోట్ల లోపే షేర్ ని సాధించగా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Robin Hood 2 Days WW Collections Report(Inc GST)
👉Nizam: 1.10Cr~
👉Ceeded: 38L~
👉Andhra: 1.35Cr~
AP-TG Total:- 2.83CR(5.55CR~ Gross)
👉KA+ROI: 27L~
👉OS: 65L~
Total WW Collections – 3.75CR~(7.55CR~ Gross)
మొత్తం మీద సినిమా 28.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 24.75 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఈ రెండు రోజుల్లో ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి.