Home న్యూస్ అన్ని సినిమాలు డౌన్…స్త్రీ2 కలెక్షన్స్ సునామీ…2 డేస్ లో 100 కోట్ల ఊచకోత!

అన్ని సినిమాలు డౌన్…స్త్రీ2 కలెక్షన్స్ సునామీ…2 డేస్ లో 100 కోట్ల ఊచకోత!

0
Stree2 Movie 2 Days Total Collections Report
Stree2 Movie 2 Days Total Collections Report

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నేషనల్ హాలిడే రోజుల రిలీజ్ అయిన శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మూవీ అంచనాలను మించి ఆడియన్స్ ను మెప్పించగా మొదటి రోజు ఊహకందని కలెక్షన్స్ తో రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…

ఇక రెండో రోజు నార్మల్ శుక్రవారం అయినా వర్కింగ్ డే అవ్వడంతో పోటిలో ఉన్న హిందీ టు రీజనల్ మూవీస్ అన్నీ కూడా హెవీగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న చోట్ల స్త్రీ2 మూవీ మాత్రం ఊరమాస్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి దుమ్ము దుమారం లేపే రేంజ్ లో హోల్డ్ ని చూపించి దంచికొట్టింది ఇప్పుడు… మొత్తం మీద సినిమా రెండో రోజు…

30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా సినిమా అంచనాలను కూడా మించి పోయి ఏకంగా 35.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసిన ఈ సినిమా ఇప్పుడు ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో 64.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా రెండో రోజు సాధించిన కలెక్షన్స్ తో…

ఓవరాల్ గా 2 రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా సినిమాకి ఇప్పుడు శనివారం నుండి సోమవారం వరకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా కలిసి వస్తూ ఉండటంతో ఈ లాంగ్ వీకెండ్ లో సినిమా అవలీలగా ఇప్పుడు….

200-220 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక 3వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో అవలీలగా 45-48 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా 3 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here