బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి జోరునే చూపెడుతుంది ఇప్పుడు…
మొదటి రోజున ఆల్ మోస్ట్ 10 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా రెండో రోజున 12.4 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మంచి ట్రెండ్ ను చూపించింది ఇప్పుడు. రెండో రోజు మొత్తం మీద 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను…
తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా సొంతం చేసుకోగా షేర్ ఆల్ మోస్ట్ 45 లక్షల లోపు ఉండే అవకాశం ఉండగా… ఇక నార్త్ అమెరికాలో సినిమా 125K డాలర్స్ మార్క్ ని అందుకుని అక్కడ కూడా మంచి ట్రెండ్ నే చూపించింది. మొత్తం మీద సినిమా ఇప్పుడు…
రెండు రోజుల్లో టోటల్ గా సాధించిన ఎస్టిమేట్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Subham Movie 2 Days Total WW Collections Report(est)
👉Nizam: 30L~
👉Total AP: 45L~
AP-TG Total:- 0.75CR(1.40CR~ Gross)
👉KA+ROI+OS : 0.58CR****approx
Total WW Collections: 1.33CR(Gross – 2.60CR~)
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 2.80 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుందని అంచనా…సినిమా ప్రస్తుతానికి మంచి జోరునే చూపెడుతూ ఉండగా వీకెండ్ లో ఓవరాల్ గా మంచి రికవరీని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.