Home న్యూస్ మోహన్ లాల్ తుడరుం 2 డేస్ కలెక్షన్స్…మాస్ ఊచకోత అంటే ఇదే!!

మోహన్ లాల్ తుడరుం 2 డేస్ కలెక్షన్స్…మాస్ ఊచకోత అంటే ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా లూసిఫర్2 సినిమాతో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లేటెస్ట్ మూవీ తుడరుం(Thudaram Telugu Movie) తో రీసెంట్ గా మరోసారి వచ్చి ఊహకందని ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా మాస్ ఊచకోత కోస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం.

మంచి రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజున వరల్డ్ వైడ్ గా 16.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోయగా రెండో రోజు అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో దుమ్ము దుమారం లేపింది…సినిమా తెలుగులో ఒకరోజు లేట్ గా…

రిలీజ్ అవ్వగా లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన సినిమా ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా తెలుగు లో డీసెంట్ హిట్ కోసం 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది….సినిమా మరో 2.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాలి.

ఇక సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది. ఏకంగా 24.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 11.90 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది. దాంతో టోటల్ గా ఇప్పుడు 2 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి…

వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
 Thudarum Movie Movie 2 Days Total WW Collections Report
👉Kerala – 12.55CR~
👉Telugu States- 0.50Cr~
👉Karnataka – 1.80Cr~
👉Tamil+ROI – 1.25Cr
👉Overseas – 24.65CR ***Approx

Total WW Collections – 40.75CR(19.90CR~ Share)

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…2 రోజుల్లో మాస్ కుమ్ముడు కుమ్మేసిన సినిమా మరో 26.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడో రోజు సినిమా ఏ రేంజ్ లో కుమ్ముతుందో చూడాలి.

Mohan Lal Thudarum 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here