యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే రికార్డులు క్రియేట్ చేస్తుంది అనుకున్నా అలాంటిదేమీ జరగలేదు, దానికి తోడూ విపరీతమైన నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు అనుకున్న దాని కన్నా కూడా భారీగా స్లో డౌన్ అయ్యి పతనం అయిపొయింది బాక్స్ ఆఫీస్ దగ్గర..
తెలుగు రాష్ట్రాలలో సినిమా రెండో రోజు 2.3 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కానీ సినిమా కంప్లీట్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మినిమమ్ ఇంపాక్ట్ ని చూపక పోవడం, చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు పడటంతో…
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1.54 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది సినిమా. ఇక హిందీ లో మాత్రం బెటర్ కలెక్షన్స్ ని సాధించడంతో రెండో రోజు సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మాత్రం 4.06 కోట్ల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర… దాంతో ఇప్పుడు టోటల్ గా 2 రోజులకు గాను సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 5.00Cr
👉Ceeded: 1.52Cr
👉UA: 1.47Cr
👉East: 76L
👉West: 48L
👉Guntur: 87L
👉Krishna: 55L
👉Nellore: 46L
AP-TG Total:- 11.11CR(18.35CR~ Gross)
👉KA+ROI – 75L
👉Other Languages – 35L
👉North India – 2.50Cr~
👉OS – 2.80Cr
Total World Wide – 17.51CR(33.50CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 90 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పుడు టోటల్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే సినిమా మరో 72.49 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.