Home న్యూస్ కల్కి 2898 AD చూడబోతున్నారా…2D-3D….ఏది బెస్ట్ అంటే!!

కల్కి 2898 AD చూడబోతున్నారా…2D-3D….ఏది బెస్ట్ అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898AD Movie) మొదటి రోజు సూపర్బ్ వసూళ్ళని అందుకుంది, రెండో రోజు కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని అన్ని చోట్లా చూపించి కుమ్మేసింది. నార్మల్ వీక్ వర్కింగ్ డేస్ లో రిలీజ్ అయిన సినిమా కి ఇప్పుడు వీకెండ్ అడ్వాంటేజ్ లభించగా…

క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా చాలా వరకు జోరుని సినిమా కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సినిమా ను చూడటానికి వెళ్ళే ఆడియన్స్ లో ఒక డౌట్ ఉంది…సినిమాను 2D వర్షన్ లో చూడాలా లేక 3D వర్షన్ లో చూస్తె బాగుంటుందా అని…మేం రెండు వర్షన్ లో బెస్ట్ థియేటర్స్ లో చూశాం కాబట్టి ఆడియన్స్ డబ్బులు వృదా అవ్వకూడదు అన్న ఉద్దేశ్యంతో ఇది చెబుతున్నాం…

3D వర్షన్ బాగానే ఉంది కానీ ఆ ఎఫెక్ట్స్ అన్నీ  అనుకున్న రేంజ్ లో లేవు, 3D ఎఫెక్ట్స్ క్లైమాక్స్ పోర్షన్ లో మినహా మిగిలిన చోట్ల పెద్దగా సెట్ అవ్వలేదు, కొన్ని చోట్ల బ్లర్ అయిన ఫీలింగ్ కలిగింది…అలాగే మూడు గంటలు 3D గ్లాసులు పెట్టుకుని చూడటం ఇబ్బందిగా కూడా అనిపించింది….కానీ అదే టైంలో మంచి థియేటర్ లో 2D వర్షన్ లో సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంటే…

ఎలాంటి ఇబ్బంది లేకుండా 2D వర్షన్ చాలా బెటర్ గా అనిపించింది…..విజువల్స్, గ్రాండియర్, ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా 3D లో కన్నా కూడా 2D లోనే ఎక్కువగా నచ్చాయి అని చెప్పాలి… ఒక్క క్లైమాక్స్ పోర్షన్ లో వచ్చే ఎఫెక్ట్స్ తప్పితే 3D వర్షన్ అయితే పెద్దగా ఇంప్రెస్ చేయలేదు అనే చెప్పాలి…అందుకే మీ డబ్బులు వృధా అవ్వకూడదు అనుకుంటే…

సింపుల్ గా 2D వర్షన్ లో సినిమా ను చూడొచ్చు…. వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కళకళలాడబోతూ ఉండగా, ఆల్ మోస్ట్ 3 నెలల అన్ సీజన్ తర్వాత ఫస్టాఫ్ కి ఇప్పుడు కల్కి గ్రాండ్ గా ఎండ్ కార్డ్ వేసి సెకెండ్ ఆఫ్ వచ్చే సినిమాలకు బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టబోతుంది… ఇక కలెక్షన్స్ పరంగా సినిమా ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here