Home న్యూస్ డిసాస్టర్ డబుల్ ఇస్మార్ట్ కన్నా సరిపోదా శనివారం తక్కువ ఏంటి సామి!!

డిసాస్టర్ డబుల్ ఇస్మార్ట్ కన్నా సరిపోదా శనివారం తక్కువ ఏంటి సామి!!

0
Double iSmart Vs SARIPODHAA SANIVAARAM 1st Day Collections Comparision
Double iSmart Vs SARIPODHAA SANIVAARAM 1st Day Collections Comparision

ఈ ఇయర్ మీడియం బడ్జెట్ మూవీస్ లో కొన్ని సినిమాలు అంచనాలను మించి పెర్ఫార్మ్ చేశాయి కానీ ఎక్కువ మీడియం బడ్జెట్ మూవీస్ అంచనాలను అందుకోలేక పొయాయి. ఇక ఆగస్టు నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న టైర్ 2 హీరోల సినిమాలుగా ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart) మూవీ తో పాటు….

నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమాలు 15 రోజుల గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి.. ఒక సినిమాకి భారీ పోటిలో మొదటి ఆటకే డిసాస్టర్ రిపోర్ట్ లు సొంతం అయ్యాయి. మరో సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అయ్యింది.

కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం మీడియం రేంజ్ మూవీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్న సరిపోదా శనివారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసి డబుల్ ఇస్మార్ట్ కన్నా తక్కువ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…డబుల్ ఇస్మార్ట్ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో….

Double iSmart Movie 1st Day Total WW Collections!!

6.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…అది కూడా పోటిలో మిస్టర్ బచ్చన్ మరియు ఇతర సినిమాల పోటిలో…కానీ సోలో రిలీజ్, పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సరిపోదా శనివారం మాత్రం మొదటి రోజు 5.88 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది… కానీ సినిమా మీద ఉన్న హైప్ అండ్ టాక్ ను బట్టి మొదటి రోజు…

సినిమా దసరా మూవీ తర్వాత డబుల్ డిజిట్ షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంటుంది అని అందరూ అంచనా వేసినా ఎందుకో అండర్ పెర్ఫార్మ్ చేసిన సరిపోదా శనివారం జస్ట్ ఓకే అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది. ఓపెనింగ్స్ విషయంలో వెనకబడినా టాక్ సరిపోదా శనివారం సూపర్ పాజిటివ్ గా ఉండటంతో లాంగ్ రన్ లో జోరు చూపించి బిజినెస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here