సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే అంచనాలను అందుకున్నాయి. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన విరూపాక్ష అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఆ అడ్వాంటేజ్ ను వాడుకుంటూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా కొత్త సినిమాలను సైతం డామినేట్ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
ఏప్రిల్ 30న టాలీవుడ్ థియేటర్స్ లో ఆడుతున్న థియేటర్స్ లో రిలీజ్ అయిన కొత్త సినిమాలను ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ విరూపాక్ష సినిమా ఫుల్ డామినేట్ చేసింది. ఏజెంట్ మూవీ 3వ రోజు 43 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
పొన్నియన్ సెల్వన్ 2 సినిమా మూడో రోజు 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఈ రెండు సినిమాలు కలిపి మూడో రోజు 1.83 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 10వ రోజులో ఉన్న విరూపాక్ష సినిమా మాత్రం ఈ రెండు సినిమాల కన్నా కూడా….
55 లక్షల రేంజ్ లో ఎక్కువ షేర్ ని అందుకుని 2.38 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. పాజిటివ్ టాక్ పవర్ ఏంటో చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా ఈ వీకెండ్ లో ఓ రేంజ్ లో డామినేట్ చేసింది. ఇక ఈ రోజు కూడా విరూపాక్ష ఫుల్ డామినేట్ చేసే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.