నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తో అల్టిమేట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమాతో రాగా ఈ సినిమా కూడా ఓవరాల్ గా పండగ సెలవుల తర్వాత స్లో డౌన్ అయినా కానీ ఉన్నంతలో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో బాలయ్య ఖాతాలో బాక్ టు బాక్….
సాలిడ్ హిట్స్ పడగా 2 సినిమాలు కూడా ఇప్పుడు అటూ ఇటూగా 75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించాయి. 2 సినిమాల టోటల్ షేర్ అక్షరాలా 150 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపిందని చెప్పాలి ఇప్పుడు.
ఇక 2 సినిమాల టోటల్ గ్రాస్ లెక్కలు కూడా ఏకంగా 258 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి. అఖండ సినిమా టోటల్ రన్ లో 133.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించగా వీర సింహా రెడ్డి సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో….
125 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుంది. దాంతో ఈ రెండు సినిమాల టోటల్ గ్రాస్ లెక్క 258 కోట్ల రేంజ్ లో ఉండగా బాలయ్య కెరీర్ లోనే ఇది ఆల్ టైం పీక్ స్టేజ్ అని చెప్పాలి. తన అప్ కమింగ్ మూవీస్ ని కూడా ఇదే రేంజ్ లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దితే కచ్చితంగా బాలయ్య కెరీర్ లో ఇంతకుమించిన హిట్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.