నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి అల్టిమేట్ ఓపెనింగ్స్ ని అందుకున్నా తర్వాత స్లో అయినా పండగ సెలవుల్లోనే చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు రావడంతో తర్వాత స్లో అయినా కానీ ఓవరాల్ గా క్లీన్ హిట్ గా నిలిచింది. సినిమా రాయలసీమ ఏరియాలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా లాస్ట్ 2 సినిమాల కలెక్షన్స్ పరంగా బాలయ్య మిగిలిన సీనియర్ హీరోల కన్నా భారీ…
లీడ్ తో దుమ్ము దుమారం లేపగా స్టార్ హీరోల విషయంలో RRR ని పక్కకు పెడితే మిగిలిన మూవీస్ లో అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో 18.27 కోట్లు, పుష్ప 15.17 కోట్లతో కలిపి 33.44 కోట్లు కలెక్ట్ చేయగా ఆ తర్వాత ప్లేస్ లో బాలయ్య నిలవడం విశేషం అని చెప్పాలి.
అఖండ సినిమాతో అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చిన బాలయ్య ఆ సినిమాతో 16.05 కోట్ల షేర్ ని అందుకోగా ప్రస్తుతానికి వీర సింహా రెడ్డి సినిమా 16.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడంతో టోటల్ గా ఈ రెండు సినిమాలు కలిపి రాయలసీమ ఏరియాలో…
ఏకంగా 32.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. అఖండ కి ముందు కెరీర్ లోనే ఆల్ టైం లో అనిపించే లెవల్ లో ఉన్న బాలయ్య ఇప్పుడు బాక్ టు బాక్ సక్సెస్ లతో రాయలసీమ ఏరియాలో తన స్టామినాని చూపిస్తూ బాక్ టు బాక్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు.