ఒక ప్రొడక్షన్ హౌస్ నుండి సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవ్వడం, అందులో కొన్ని హిట్స్ కొన్ని ఫ్లాఫ్స్ అవ్వడం లాంటివి జరుగుతూనే ఉంటుంది, కానీ కొన్ని సినిమాలు ఎక్కువ నష్టాలను మిగిలిస్తే కొన్ని సినిమాలు ఆ నష్టాలను పూడ్చుతూ లాభాలను తెచ్చి పెడతాయి. ఇప్పుడు ఇలాంటిదే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ కి సార్ మూవీ చేసి పెడుతూ మంచి లాభాలను సొంతం చేసుకుంటూ వెళుతూ ఉండటం విశేషం…
ఈ బ్యానర్ నుండి లాస్ట్ ఇయర్ డిజే టిల్లు మంచి విజయాన్ని అందుకుంటే భీమ్లా నాయక్ టికెట్ రేట్స్ వల్ల ఇబ్బందులు ఫేస్ చేసినా మేకర్స్ కి మాత్రం ప్రాఫిట్స్ ను ఇచ్చింది, కానీ ఈ బ్యానర్ నుండి వచ్చిన స్వాతిముత్యం సినిమా కానీ రీసెంట్ గా వచ్చిన…
బుట్టబొమ్మ సినిమాలు కానీ థియేట్రికల్ రన్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించక పోవడం, నాన్ థియేట్రికల్ రైట్స్ అనుకున్న రేంజ్ లో దక్కించుకోక పోవడంతో ఓవరాల్ గా 6-8 కోట్ల మధ్యలో నష్టాలను మిగిలించినట్లు ట్రేడ్ లో టాక్ ఉంది. అదే టైంలో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
40 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన సార్ మూవీ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో 84 కోట్ల దాకా బిజినెస్ ను చేయగా అక్కడే ఓ రేంజ్ లో ప్రాఫిట్ రాగా ఇప్పుడు థియేట్రికల్ రన్ ప్రాఫిట్ మరింత బోనస్ అని చెప్పాలి. రీసెంట్ టైంలో ప్రొడ్యూసర్స్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో సార్ ముందు నిలిచే సినిమా అని చెప్పాలి.