Home న్యూస్ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు…50 ఔట్…చరిత్రలో 2 వ సినిమా!

రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు…50 ఔట్…చరిత్రలో 2 వ సినిమా!

863
0

ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత మహా అయితే 2 నెలలు లేదా మూడు నెలలు మాట్లాడుకుంటారు, ఇంకా కల్ట్ మూవీ అయితే 6 నెలలు ఆ సినిమా గురించి చర్చిస్తారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 3 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ వార్తల్లో నిలిచే సినిమా విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి అనే కల్ట్ మూవీ అనే చెప్పాలి. రిలీజ్ కి ముందు నుండే సాలిడ్ అంచనాలను మోసిన ఈ సినిమా..

రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలను నిలబెట్టుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల షేర్ ని వసూల్ చేసి విజయ్ దేవరకొండని ఓవర్ నైట్ లో స్టార్ ని చేసింది… ఈ సినిమా తర్వాత ఇతర భాషల్లో రీమేక్ అవ్వగా తమిళ్ లో నిరాశ పరిచినా కానీ..

హిందీ లో మాత్రం అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, సినిమా సినిమా రిజల్ట్ తో ఒరిజినల్ ట్రైలర్ ని మళ్ళీ మళ్ళీ చూడటం మొదలు పెట్టారు అందరూ. దాంతో సినిమా ట్రైలర్ కి వ్యూస్ అలా పెరుగుతూ పెరుగుతూ టాలీవుడ్ లో బాహుబలి 2 ట్రైలర్ తర్వాత 40 మిలియన్స్ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క…

ట్రైలర్ గా రికార్డ్ సృష్టించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికీ కూడా వ్యూస్ ని సొంతం చేసుకుంటూనే ఉంది, రీసెంట్ గా మరో ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ టాలీవుడ్ తరుపున 50 మిలియన్స్ మార్క్ ని అందుకున్న రెండో ట్రైలర్ లో బాహుబలి 2 తర్వాత ప్లేస్ లో నిలిచి మరో చరిత్రకెక్కె రికార్డ్ ను సొంతం చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచింది.

బాహుబలి 2 ట్రైలర్ కి 64.01 మిలియన్ వ్యూస్ ప్రస్తుతానికి ఉండగా అర్జున్ రెడ్డి ట్రైలర్ కి 50.19 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి ఇప్పటికీ జోరు చూపుతూ దూసుకు పోతుంది, ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే… ఈ రెండు సినిమాలు కాకుండా టాలీవుడ్ లో మరే సినిమా ట్రైలర్ కూడా కనీసం 40 మిలియన్స్ మార్క్ ని అందుకోలేదు అంటే అర్జున్ రెడ్డి ట్రైలర్ డామినేషన్ ని అర్ధం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here