Home న్యూస్ డే 2….4.34…..బాలయ్య మాస్ రాంపేజ్ చూపించాడు!

డే 2….4.34…..బాలయ్య మాస్ రాంపేజ్ చూపించాడు!

0

బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి క్రేజ్ సాలిడ్ గా ఉంటుంది, ఇద్దరు కలిసి చేసిన సింహా కానీ లెజెండ్ కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఓ రేంజ్ లో సంచలనాలు సృష్టించి బాలయ్య కి ఎప్పటికప్పుడు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు వరుస పెట్టి ఫ్లాఫులలో ఉన్న బాలయ్యకి ఈ మధ్య హిట్స్ కి దూరం అయిన బోయపాటి కలిసి ఆడియన్స్ ముందుకు…

డిసెంబర్ 2 న అఖండ సినిమాతో రాబోతూ ఉండగా సినిమా పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది రీసెంట్ గా రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్… సింహా లెజెండ్ ల సినిమాల దారిలోనే కాన్సెప్ట్ ను అనుకుని దానికి డిఫెరెంట్ బ్యాగ్ డ్రాప్ ని సెట్ చేసి అల్లిన అఖండ…

కథ ట్రైలర్ వరకు అయితే బాగా మెప్పించగా బాలయ్య ఫెరోశియస్ అఘోరా లుక్ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయిన తర్వాత 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది.

24 గంటల్లో 10.49 మిలియన్ వ్యూస్ ని అలాగే 351K లైక్స్ ని అందుకుని దంచికొట్టగా ఇప్పుడు రెండో రోజు కి కూడా అల్టిమేట్ గా హోల్డ్ చేసి బాలయ్య మాస్ రాంపేజ్ చూపెట్టి దుమ్ము దులిపేశాడు. రెండో రోజు ఏకంగా 4.34 మిలియన్ వ్యూస్ రాగా లైక్స్ 34K లైక్స్ సొంతం అయ్యాయి. రెండో రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని టాలీవుడ్ లో…

సొంతం చేసుకున్న ట్రైలర్ లలో ఒకటిగా నిలిచింది అఖండ ట్రైలర్. ఓవరాల్ గా రెస్పాన్స్ సాలిడ్ గా ఉండటం రీచ్ కూడా భారీగా సొంతం చేసుకోవడంతో ఇక డిసెంబర్ న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కచ్చితంగా సంచలనాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బిజినెస్ రేంజ్ ఎలా ఉంటుందో కొన్ని రోజుల్లో తేలబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here