బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు హైర్స్ హెల్ప్ తో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆచార్య సినిమా అందులో వర్త్ షేర్ పరంగా చూసుకుంటే రీసెంట్ టైం లో స్టార్ హీరోల మూవీస్ లో లోవేస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని నిరాశ పరచగా సినిమా రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా మొదటి రోజు వర్త్ షేర్ 18.69 కోట్ల కలెక్షన్స్ దృశ్యా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో…
ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఆల్ మోస్ట్ 65-70% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, నైజాంలో డ్రాప్స్ హెవీగా ఉండగా ఆంధ్ర అండ్ సీడెడ్ లో కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినా ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ డ్రాప్స్ భారీగా ఉండటంతో ఈ రోజు మొత్తం మీద…..
తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొత్తం మీద 5.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటేనే సాధ్యం. ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మంచి ట్రెండ్ ని చూపిస్తే సినిమా 6 కోట్ల రేంజ్ నుండి 6.5 కోట్ల దాకా…
వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పాలి కానీ దానికి కూడా సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపెట్టాల్సి ఉంటుంది, ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో రెండో రోజు భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో కూడా హెవీ డ్రాప్స్ ఉన్నాయి. దాంతో మొత్తం మీద సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 7.5 కోట్ల నుండి 8 కోట్ల దాకా కలెక్షన్స్ ని….
ఓవరాల్ గా రెండో రోజు అందుకునే అవకాశం ఉంది… మొత్తం మీద రెండో రోజు సినిమా హెవీ డ్రాప్స్ ఎఫెక్ట్ తో సినిమా 132.50 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి ఇది ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక రెండు రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక అంచనాల కన్నా తక్కువ కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి ఇక…