బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది… కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం అండర్ పెర్ఫార్మ్ చేసింది. ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20-25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేయగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి సినిమా బాగానే….
హోల్డ్ చేసి గ్రోత్ ని చూపించింది. దాంతో తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సినిమా 2.8 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తుంది, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 3.2 కోట్ల నుండి 3.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా రెండో రోజు కుమ్మేసినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. సినిమా ఇంకా సాలిడ్ గా కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 2 రోజుల్లో అఫీషియల్ గా సాధించే కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా ఉండవా చూడాలి….