బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రలో దెబ్బ పడినా కానీ వరల్డ్ వైడ్ గా మాత్రం మొదటి రోజు అంచనాలను మించే రేంజ్ లో కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకుంది అని చెప్పాలి. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద…
26.42 కోట్ల షేర్ ని అందుకోగా అందులో హైర్స్ 3.69 కోట్లు ఉండగా అవి తీసేస్తే… వర్త్ షేర్ మొత్తం మీద 22.73 కోట్ల దాకా ఉండగా ఇప్పుడు రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తో పోల్చితే మొత్తం మీద 45% టు 50% వరకు డ్రాప్స్ ను…
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది, మొదటి రోజు నుండి రెండో రోజు ఇలాంటి డ్రాప్స్ కామన్ అనే చెప్పాలి. చాలా వరకు సినిమాలు 50% టు 60% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి, ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా 50% లోపే డ్రాప్స్ ను రెండో రోజు సొంతం చేసుకుంటూ ఉండగా…
ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ బాగుండటం, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగానే జోరుగా సాగుతూ ఉండటం తో ఇప్పుడు రెండో రోజు కూడా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి, సినిమా రెండో రోజు ఇప్పుడు 10 కోట్ల నుండి 11 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పొతే రెండో రోజు సినిమా 12 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం లేదా మించిపోయే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని అంచనా వేయొచ్చు. మరి రోజు ముగిసే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక… డే ఎండ్ అయ్యే టైం కి మరో ఆర్టికల్ లో డీటైల్స్ ని అప్ డేట్ చేస్తాం.