Home న్యూస్ కొండపొలం – ఆరడుగుల బుల్లెట్ 2nd డే కలెక్షన్స్ రిపోర్ట్!!

కొండపొలం – ఆరడుగుల బుల్లెట్ 2nd డే కలెక్షన్స్ రిపోర్ట్!!

3871
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ 2 సినిమాలు పోటి పడ్డాయి, ఒకటి ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పంజా వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండ పొలం కాగా మరోటి రీసెంట్ గా సీటిమార్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన గోపీచంద్ నటించిన ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్… రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ అయితే ఆడియన్స్ నుండి రాలేదు అనే చెప్పాలి కానీ ఉన్నంతలో కొండ పొలం సినిమా కి మొదటి రోజు…

ఓపెనింగ్స్ అయితే యావరేజ్ గా లభించాయి, ఆరడుగుల బుల్లెట్ ఓపెనింగ్స్ విషయంలో నిరాశ పరచగా సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తో పోల్చుకుంటే 25-30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, కానీ కొన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కూడా…

పడటం విశేషం అనే చెప్పాలి. దాంతో ఇప్పుడు రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 16-18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్లా బాగుంటే 20 లక్షల మార్క్ ని అందుకునే అవకాశం కూడా ఉంది సినిమా కి. ఇక కొండ పొలం విషయానికి వస్తే…

మొదటి రోజు తో పోల్చితే సినిమా రెండో రోజు డ్రాప్స్ ఆల్ మోస్ట్ 50-55% వరకు ఉన్నాయి, వైజాగ్ లో అలాగే కొన్ని ఇతర చోట్ల ఫుల్స్ పడ్డా కానీ ఓవరాల్ గా డ్రాప్స్ ఎక్కువే వచ్చాయి, దాంతో ఈ సినిమా ఇప్పుడు రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది….

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కాగుంటే సినిమా రెండో రోజు 55-60 లక్షల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, మొత్తం మీద 2 సినిమాలు కూడా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే ఈ ఓపెనింగ్స్ ఏమాత్రం సరిపోవు, ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మరి 2 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్స్ ఈ సినిమాలకు ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here