Home న్యూస్ క్రాక్ రెండో రోజు కలెక్షన్స్…మాస్ మహారాజ్ బ్యాటింగ్ రేంజ్ ఇది!!

క్రాక్ రెండో రోజు కలెక్షన్స్…మాస్ మహారాజ్ బ్యాటింగ్ రేంజ్ ఇది!!

2351
0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ క్రాక్ అల్టిమేట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 7.31 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ తో రవితేజ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.

ఇక రెండో రోజు సినిమా కి మండే రావడం తో వర్కింగ్ డే కూడా అవ్వడం తో సినిమా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు వచ్చే సరికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 30-40% రేంజ్ లో డ్రాప్స్ ను దక్కించుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు…

వచ్చే సరికి మాత్రం సినిమా గ్రోత్ ను సొంతం చేసుకుని సాలిడ్ ఆక్యుపెన్సీ తో దూసుకు పోతుంది. రవితేజ సినిమాలకు ఆఫ్ లైన్ లోనే ఎక్కువ బుకింగ్స్ థియేటర్స్ లో జరుగుతున్నాయి కాబట్టి రెండో రోజు కూడా మాస్ ఆడియన్స్ తో సినిమా అంచనాలను మించే…

అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు. సినిమా మంచి గ్రోత్ ని సొంతం చేసుకోవడం తో 2 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక అంతకుమించి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటే కచ్చితంగా అంచనాలను మరోసారి సినిమా రెండో రోజు మించి పోతుంది అని చెప్పొచ్చు. టార్గెట్ కూడా తక్కువే కాబట్టి…

సినిమా సాధించే ఈ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ చేసే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అమెరికాలో 50 వేలకి పైగా డాలర్స్ ను సొంతం చేసుకున్న సినిమా లిమిటెడ్ రిలీజ్ లోనే మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక రెండు రోజులకు గాను సినిమా అఫీషియల్ గా ఎంతవరకు కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here