యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలకు మించి కలెక్షన్స్ పరంగా హిస్టరీ క్రియేట్ చేసింది, టాలీవుడ్ హిస్టరీ లోనే మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేసిన రెండో సినిమా గా మారిన ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో కూడా రెండో 100 కోట్ల గ్లోబల్ గ్రాసర్ గా నిలిచింది, ఇక సినిమా రెండో రోజున బాక్స్ ఆఫీస్ స్టేటస్ అదిరిపోయింది అని చెప్పాలి.
రెండు తెలుగు రాష్ట్రాలలో సీడెడ్ ఏరియా లో అలాగే కొన్ని మాస్ సెంటర్స్ లో డ్రాప్స్ గట్టిగానే ఉన్నా కానీ మొదటి వీకెండ్ కి అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరగడం తో ఓవరాల్ గా కలెక్షన్స్ రెండో రోజు కూడా సాలిడ్ గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగానే ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 15 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా రెండో రోజు అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పోచ్చు.
ఇక హిందీ వర్షన్ స్ట్రాంగ్ గానే ఉండగా రెండో రోజు కూడా సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది, అక్కడ వీకెండ్ బుకింగ్స్ భారీ ఎత్తున జరగడం తో రెండో రోజు కూడా 18 కోట్ల నుండి 20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ రావడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు.
ఇక తమిళ్ అండ్ మలయాళ వర్షన్స్ మాత్రం భారీ గా హ్యాండ్ ఇచ్చాయి. రీజన్స్ ఏంటో తెలియదు కానీ సినిమా ఈ రెండు ఏరియాల్లో అనుకున్న లెవల్ లో బుకింగ్స్ జరగలేదు అలాగే రెండో రోజు డ్రాప్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. మరి ఓవరాల్ గా రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.