బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఆంధ్రలో కలెక్షన్స్ పరంగా తీవ్ర ఇబ్బందులను ఎదురుకున్నా కానీ మిగిలిన చోట్ల అల్టిమేట్ వసూళ్లు సాధించడం ముఖ్యంగా నైజాం లో ఇండస్ట్రీ రికార్డ్ ఓపెనింగ్స్ ని అందుకోవడంతో ఓవరాల్ గా కుమ్మింది కానీ అన్నీ సజావుగా సాగి ఉంటే రాంపేజ్ మరో విధంగా ఉండేది… ఓవరాల్ గా సినిమా మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…
ముగించిన తర్వాత రెండో రోజులో అడుగు పెట్టగా సినిమా మిగిలిన సినిమాల మాదిరిగానే రెండో రోజు డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకుంది. సినిమా రెండో రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఆల్ మోస్ట్ 50% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్…
సేల్స్ విషయంలో కూడా డ్రాప్స్ గట్టిగానే కనిపించాయి కానీ ఉన్నంతలో మళ్ళీ ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా గ్రోత్ ని చూపెట్టగా ఇప్పుడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు 10 కోట్లకి అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి.
టాలీవుడ్ లో అతి కొద్ది సినిమాలు మాత్రమే రెండో రోజు 10 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకున్నాయి ఇప్పుడు పుష్ప అందులో ఒకటిగా చేరే అవకాశం ఉండగా అన్ని చోట్ల టికెట్ సేల్స్ అంచనాలను మించి ఉంటే ఈ లెక్క ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రెండో రోజు ఓవరాల్ గా…
12-13 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్క 14 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఉంది, ఓవరాల్ గా ఇది ఫెంటాస్టిక్ హోల్డ్ అనే చెప్పాలి. సినిమా అన్ని చోట్లా బాగా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇక రెండో రోజు సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి.