ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అందుకునే రేంజ్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకోలేక పోయింది. దానికి కారణం అందరికీ తెలిసిందే. కానీ ఇతర చోట్ల మట్టుకు సినిమా అల్టిమేట్ ఓపెనింగ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సత్తా చాటుకుని ఓవరాల్ గా సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజులో అడుగు పెట్టినా సినిమా నైజాం ఏరియా బుకింగ్స్ ముందు నుండే సాలిడ్ గా రెండో రోజు కూడా జరగగా ఇప్పుడు నైజాం ఏరియాలో రెండో రోజు కూడా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు బుకింగ్స్ బాగానే జోరుగా సాగుతున్నాయి.
ఇక ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో కొన్ని చోట్ల బాగున్నా కొన్ని చోట్ల డ్రాప్స్ కూడా గట్టిగానే ఉన్నాయి అని చెప్పాలి. ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఆల్ మోస్ట్ 40% వరకు డ్రాప్స్ కనిపించాయి… ఇక ఆఫ్ లైన్ లో కూడా డ్రాప్స్ ఉండగా రెండో రోజు ఇలాంటి డ్రాప్స్ నార్మల్ అనే చెప్పాలి.
మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు 10 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి… ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క ఎంతవరకు ముందుకు వెళుతుంది అన్నది చెప్పగలం…
ఇతర రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా కూడా సినిమా రెండో రోజు బాగానే హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. మొత్తం మీద రెండో రోజు కూడా మాస్ కుమ్ముడు ఖాయం అనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. నైట్ షోల టైం కి సినిమా రేంజ్ ఎంతవరకు వెల్ల గలుగుతుందో మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.