Home న్యూస్ రిపబ్లిక్ 2nd డే కలెక్షన్స్…ఇవాళ కుమ్ముతుందిగా!!

రిపబ్లిక్ 2nd డే కలెక్షన్స్…ఇవాళ కుమ్ముతుందిగా!!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు మొత్తం మీద పర్వాలేదు అనిపించే రేంజ్ ఓపెనింగ్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది, సినిమా జానర్ దృశ్యా మరీ ఎక్కువ ఆశించలేం కానీ సినిమా బిజినెస్ కొంచం ఎక్కువ కాబట్టి ఆ బిజినెస్ రేంజ్ దృశ్యా చూస్తే…

ఫస్ట్ డే యావరేజ్ అనిపించే కలెక్షన్స్ తో ఓపెన్ అయిన రిపబ్లిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 2.01 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 2.28 కోట్ల షేర్ తో ఓపెన్ అవ్వగా రెండో రోజు గాంధీ జయంతి హాలిడే ఉన్న కారణంగా సినిమా బాగానే హోల్డ్ చేసి….

కలెక్షన్స్ పరంగా బాగా ట్రెండ్ అవుతుంది అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలతో పోల్చితే 15% డ్రాప్ అయినా కానీ కొన్ని చోట్ల ఫుల్స్ తో జోష్ చూపింది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి ట్రెండ్ తో దూసుకు పోతున్న సినిమా…

ఓవరాల్ గా మొదటి రోజుతో పోల్చితే 30-35% వరకు మాత్రమే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఈవినింగ్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండటంతో రోజును ఫుల్ సాటిస్ ఫై గా ముగించేలా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ డే తో పోల్చితే 2వ రోజున సినిమా ఇప్పుడు 1.4 కోట్ల నుండి 1.6 కోట్ల రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని…

సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది…ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్లా బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకా ఎక్కువకి చేరే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా రెండో రోజు సినిమా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది అని చెప్పాలి కానీ సినిమా బిజినెస్ దృశ్యా ఇంకా బెటర్ గా ట్రెండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సినిమాకి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here