బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన 2 సినిమాలు బింబిసార మరియు సీతా రామం రెండూ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నాయి. వీటిలో బింబిసార అన్ని సెంటర్స్ లో మంచి జోరు చూపిస్తూ కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంటూ దుమ్ము లేపుతూ మొదటి రోజే రచ్చ చేయగా సీతా రామం క్లాస్ సెంటర్స్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపిస్తుంది కానీ మాస్ సెంటర్స్ లో మాత్రం…
కొంచం స్లో అవ్వక తప్పలేదు. అందునా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా సినిమా ఇంకొంచం బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉండగా రెండో రోజు మరోసారి మల్టిప్లెక్సులలో అలాగే ఏ సెంటర్స్ లో మంచి హోల్డ్ ని చూపించిన ఈ సినిమా అదే సమయంలో…
బి సి సెంటర్స్ లో మాత్రం బింబిసార సాలిడ్ జోరు ని చూపిస్తూ దూసుకు పోతుంది అని చెప్పాలి. ఇక అదే టైం లో బింబిసార బి సి సెంటర్స్ లో ఫుల్ జోరుగా హోల్డ్ చేయగా ఏ సెంటర్స్ లో కూడా మంచి హోల్డ్ ని రెండో రోజు చూపించింది. మొత్తం మీద ఇప్పుడు సీతా రామం సినిమా…
రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 1.3 కోటి నుండి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరగొచ్చు. ఇక బింబిసార సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల కి పైగా కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఫైనల్ లెక్కలు బాగుంటే 3.8-4 కోట్లు, ఆ పైన కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ గా సీతా రామం 2.2-2.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉండగా బింబిసార 4 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇకొంచం పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద రెండో రోజు సీతా రామం డీసెంట్ గా హోల్డ్ చేస్తే బింబిసార మాస్ కుమ్ముడు కుమ్ముతుంది అని చెప్పాలి.