సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా రెండో రోజు లో ఎంటర్ అయ్యింది, మొదటి రోజు హైర్స్ ని పక్కకు పెడితే వర్త్ షేర్ 24.72 కోట్లు కాగా ఆ కలెక్షన్స్ తో పోల్చితే సినిమా రెండో రోజు డ్రాప్స్ ఆల్ మోస్ట్ 60% వరకు వచ్చాయి, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షో లకు ఆ డ్రాప్స్ ఇంపాక్ట్ చూపగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో తిరిగి…
సినిమా జోరు చూపుతున్న సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాల వలన చాలా చోట్లా ఇబ్బందులు ఎదురు అయ్యాయి, అయినా కానీ సూపర్ పాజిటివ్ టాక్ పవర్ చూపుతూ సైరా సినిమా కలెక్షన్స్ మరీ తగ్గకుండా బాగానే హోల్డ్ చేసి దుమ్ము లేపింది.
అయినా కానీ రెండో రోజు 12 కోట్లకు పైగా షేర్ పక్కా అనుకున్న వర్షాల వల్ల కొద్దిగా షాక్ తగలడం తో ఇప్పుడు 10 కోట్లకు పైగా అయితే కన్ఫాం అని చెప్పొచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అద్బుతంగా ఉంటె ఈ కలెక్షన్స్ కన్నా ఎక్కువ వసూళ్లు రెండో రోజు రాబట్టే అవకాశం ఉంది.
ఇక హిందీ లో కొంచం గ్రోత్ ఉండగా 3 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సౌత్ లో మిగిలిన చోట్ల మొత్తం మీద 1 కోటి నుండి కోటిన్నర వరకు షేర్ ని అందుకోవచ్చు. ఓవర్సీస్ లో కూడా 2 కోట్లకు పైగా షేర్ ని సినిమా సాధించే అవకాశం ఉంది.
దాంతో రెండో రోజు టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల నుండి 15 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇది సూపర్బ్ హోల్డ్ అనే చెప్పాలి. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయా అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.