సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్(Vettaiyan Movie 2nd day Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి కొంత మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా…
ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా మొత్తం మీద మొదటి రోజుతో కంపేర్ చేస్తే 30-35% రేంజ్ లో టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఉన్నాయి, ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ కొంచం పర్వాలేదు…
అనిపించేలా ఉంటే రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో ఎక్స్ లెంట్ గానే హోల్డ్ ని చూపిస్తున్న సినిమా…
రెండో రోజు అక్కడ 16-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, కేరళ లలో బాగానే హోల్డ్ చేసిన సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి రెండో రోజున 5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఓవర్సీస్ లో సినిమా ఓవరాల్ గా…
1.3-1.5 మిలియన్ రేంజ్ లో డాలర్స్ ను అందుకునే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా రెండో రోజు సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు రెండో రోజున 36-38 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 40 కోట్ల రేంజ్ లో…
హోల్డ్ ని చూపించే అవకాశం ఉంది, అంతకుమించి జోరు చూపించి 45 కోట్ల దాకా కనుక రెండో రోజు వసూళ్లు వస్తే ఎక్స్ లెంట్ గా రెండో రోజుని హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.