Home TRP రేటింగ్ వకీల్ సాబ్ TRP…2వ సారి కూడా అంచనాలను మించిన భీభత్సం!

వకీల్ సాబ్ TRP…2వ సారి కూడా అంచనాలను మించిన భీభత్సం!

1558
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి అల్టిమేట్ ఓపెనింగ్స్ ని అనేక అవరోధాలను ఎదురుకుని కూడా సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. కానీ అప్పటి పరిస్థితులు మరింత క్లిష్టతరం అవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలకు అటూ ఇటూగా మాత్రమె రన్ ని కొనసాగించడంతో ఉన్నంతలో మంచి వసూళ్ళని సొంతం చేసుకుని…

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఆంధ్రలో టికెట్ రేట్లు నార్మల్ గా ఉండి ఉంటే సినిమా ఉన్న తక్కువ టైం రన్ లోనే బ్రేక్ ఈవెన్ ని కూడా సొంతం చేసుకుని ఉండేది… అయినా కానీ ఉన్న తక్కువ రన్ లోనే సినిమా బాక్స్ ఆఫీస్ ను…

సాలిడ్ గా షేక్ చేసి ఒరిజినల్ వర్షన్స్ కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు సినిమాకి అంచనాలను మించి రేటింగ్ దక్కింది, ఫస్ట్ టైం టెలికాస్ట్ టైం లో 16-18 మధ్యలో సినిమా రేటింగ్…

ఉంటుందేమో అనుకుంటే ఆ అంచనాలను కూడా మించిపోయిన వకీల్ సాబ్ 19.12 రేటింగ్ తో సంచలనం సృష్టించింది. ఇక వెంటనే మరో సారి టెలికాస్ట్ చేయని జీ తెలుగు ఛానెల్ కొంచం గ్యాప్ ఇచ్చి రీసెంట్ గా సినిమాను రెండో సారి టెలికాస్ట్ చేశారు. రెండో సారి సినిమా టెలికాస్ట్ కి కూడా 6 రేంజ్ రేటింగ్ ని అంచనా వేస్తె సినిమా ఆ అంచనాలను కూడా మించి పోయి…

ఏకంగా 8.43 రేటింగ్ ని సొంతం చేసుకుని అల్టిమేట్ గా హోల్డ్ చేసింది, ఈ రేటింగ్ ఈ మధ్య చాలా సినిమాలకు ఫస్ట్ టైం టెలికాస్ట్ కి దక్కే రేంజ్ రేటింగ్ అని చెప్పాలి. ఈ రేంజ్ లో సాలిడ్ గా హోల్డ్ చేసిన వకీల్ సాబ్ టెలివిజన్ లో ఛానెల్ కి ఓవరాల్ గా ఇప్పుడు మంచి ప్రాఫిట్స్ ని ఇస్తుందని చెప్పాలి. రెండు సార్ల టెలికాస్ట్ తో ఛానెల్ పెట్టిన డబ్బు రికవరీ అయినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here