బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీక్ లో మరీ అంచనాలను అందుకోలేక పోయినా కూడా ఉన్నంతలో మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) మూవీ, తన కెరీర్ వరకు బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టార్గెట్ పెద్దదిగా ఉండటంతో ఆ టార్గెట్ ను అందుకోలేక పోతూ ఉండగా ఇప్పుడు ఫస్ట్ వీక్ ని….
కంప్లీట్ చేసుకుని రెండో వీక్ లో అడుగు పెట్టగా రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లో సుమారు 260 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తున్న సినిమా టార్గెట్ చాలా పెద్దదిగా ఉండటంతో ఆ మార్క్ ని అందుకునే అవకాశం ఇక లేనట్టే అని చెప్పాలి ఇప్పుడు.
ఓవరాల్ గా సినిమా 7వ రోజుతో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజున కొత్త సినిమాలు ఉన్నా కూడా లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకోగా ఓవరాల్ గా ప్రజెంట్ ఉన్న హోల్డ్ ని బట్టి ఇప్పుడు 25 లక్షల రేంజ్ నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా మిగిలిన చోట్ల కూడా పెద్దగా ట్రెండ్ ఏమి కనిపించలేక పోతూ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజున 42-45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఇక ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని చూపిస్తే లాంగ్ రన్ లో 50 కోట్ల గ్రాస్ ఆశలు ఉంటాయి లేకపోతె బిలో 50 కోట్ల రేంజ్ లో రన్ ను కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక 8 రోజుల టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…