ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఒక వారం పూర్తీ చేసుకుని ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టింది. సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ లభించగా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో చాలా స్లో అయిన సినిమా మొదటి వారం తర్వాత ఇంకా సగం టార్గెట్ ను వెనక్కి రాబట్టాల్సిన అవసరం ఉండగా రెండో వారం పోటి లో సినిమాలు ఉన్నప్పటికీ…
టాలీవుడ్ నుండి మాస్ మూవీ ఇదొక్కటే అవ్వడంతో ఓవరాల్ గా థియేటర్స్ ని సాలిడ్ గానే హోల్డ్ చేసింది. మొత్తం మీద సినిమా నైజాంలో 105 థియేటర్స్ ని సీడెడ్ లో 50 థియేటర్స్ ని ఆంధ్రలో 130 థియేటర్స్ ని రెండో వారం హోల్డ్ చేసినట్లు సమాచారం.
దాంతో సినిమా ఓవరాల్ గా రెండో వారాన్ని తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 285 థియేటర్స్ లో కొనసాగించబోతుంది. సినిమా రిలీజ్ అవ్వడం 700 వరకు థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయినా రెండో వారం పోటి లో సినిమాలు ఉన్నా నెగటివ్ టాక్ తో కూడా ఇన్ని థియేటర్స్ ని హోల్డ్ చేయడం…
విశేషం అనే చెప్పాలి. కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే థియేటర్స్ అయితే హోల్డ్ చేసింది కానీ కలెక్షన్స్ మాత్రం సాలిడ్ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక 2వ వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.