Home న్యూస్ రవితేజ చేయాల్సిన జాట్….సన్నీ డియోల్ కెరీర్ లో 2వ సినిమాగా రికార్డ్!!

రవితేజ చేయాల్సిన జాట్….సన్నీ డియోల్ కెరీర్ లో 2వ సినిమాగా రికార్డ్!!

0

బాలీవుడ్ లో సీనియర్ హీరోలలో రెండు దశాబ్దాల క్రితం టాప్ రేంజ్ లో ఉన్న బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) నటించిన లేటెస్ట్ మూవీ జాట్(Jaat Movie) సినిమాతో రీసెంట్ గా వచ్చి మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ ఉండగా…ఈ రెండు దశాబ్దాల టైంలో అప్పట్లో గదర్ సినిమాతో…

సంచలనం సృష్టించినా తర్వాత టైంలో మళ్ళీ గదర్2 వచ్చే వరకు పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు….ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న తర్వాత తెలుగు లో రవితేజ చేయాల్సిన కథ అయిన జాట్ ను గోపీచంద్ మలినేని….

సన్నీ డియోల్ తో చేయగా ముందు పెద్దగా బజ్ లేక పోయినా కూడా రిలీజ్ అయిన తర్వాత మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ ఇప్పుడు సన్నీ డియోల్ కెరీర్ లో రెండో సారి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది…

ఓవరాల్ గా చూసుకుంటే రీ రిలీజ్ లతో కలిపి గదర్ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా స్ట్రైట్ రిలీజ్ అయితే మాత్రం గదర్2 తర్వాత ఇప్పుడు జాట్ మూవీ రెండో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇండియాలో సినిమా 80 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా ఓవర్సీస్ లో పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది సినిమా…రవితేజ తో చేసినా ఈ మార్క్ ని అందుకోవడం…

మంచి సీజన్ లో పెద్ద కష్టమేమి అయ్యేది కాదు కానీ సన్నీ డియోల్ తో గదర్2 లాంటి సినిమా తర్వాత మేకర్స్ ఇంకా బెటర్ కలెక్షన్స్ ని ఎక్స్ పెర్ట్ చేసినా కొంచం కష్టమైనా 100 కోట్ల మార్క్ ని అయితే దాటేసి ఓవరాల్ గా బాక్ టు బాక్ 100 కోట్ల మార్క్ ని దాటి ఇంకా హిట్ కోసం కష్టపడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here