బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించి 5 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) రెండో రోజులో అడుగు పెట్టగా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా….
ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉండగా రెండో రోజు హోల్డ్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా అది అనుకున్న రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి ఇప్పుడు. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజున సినిమా మొదటి రోజుకి మించి ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఉండగా…
ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ అయితే ఉన్నాయి, మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపిస్తున్నా కూడా మిగిలిన చోట్ల ఇంపాక్ట్ తక్కువగానే ఉంది. దాంతో పాటు ఇవాళ రెండు IPL మ్యాచుల ఇంపాక్ట్ కూడా ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను…
బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా 1.5 కోట్ల రేంజ్ నుండి 1.7 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ 1.8 కోట్ల రేంజ్ నుండి ఆ పైన వెళ్ళే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా..
2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది. అది కూడా అన్ని చోట్ల ఫైనల్ లెక్కలు బాగుంటేనే సాధ్యం అని చెప్పాలి. సినిమా రెండో రోజు బాగా హోల్డ్ చేసింది అని చెప్పడానికి 2.5 కోట్లకి పైగా షేర్ ని…
అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ట్రెండ్ అలా కనిపించడం లేదు. కౌంటర్ టికెట్ సేల్స్ లో ఏమైనా గ్రోత్ ఉండి ఈ రేంజ్ కి సినిమా దగ్గరగా వెళుతుందో లేక ఓవరాల్ గా ఇదే రేంజ్ లో వసూళ్ళని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు….