బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) వరల్డ్ వైడ్ గా 5 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా…
కళ్యాణ్ రామ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే పర్వాలేదు అనిపించినా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా రెండో రోజులో అడుగు పెట్టగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు తో పోల్చితే డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా పర్వాలేదు అనిపించేలా..
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు బుకింగ్స్ లో ట్రెండ్ కనిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా బుకింగ్స్ మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా రెండో రోజున…
తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ట్రెండ్ లో ఇంప్రూవ్ అయితే సినిమా లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా మొత్తం మీద అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా గ్రోత్ ని సాలిడ్ గా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈవినింగ్ నైట్ షోలకి సినిమా మొత్తం మీద ఎంతవరకు గ్రోత్ ని చూపించగలుగుతుందో చూడాలి ఇప్పుడు….