Home న్యూస్ 2nd DAY భైరవం కలెక్షన్స్…డే 2 హోల్డ్ చేసిందా లేదా!

2nd DAY భైరవం కలెక్షన్స్…డే 2 హోల్డ్ చేసిందా లేదా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని మాస్ సెంటర్స్ లో చూపించి పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…

ఇక రెండో రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఉన్నంతలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మరీ ఎక్కువగా డ్రాప్స్ ఏమి లేకుండా హోల్డ్ ని అయితే కొనసాగిస్తుంది కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం…

ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు సినిమా అటూ ఇటూగా 40% రేంజ్ లో డ్రాప్స్ టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో…

ఓవరాల్ గా ఇప్పుడు రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరీ అనుకున్న రేంజ్ లో అయితే…

ఇంపాక్ట్ ని చూపించడం లేదు కానీ ఉన్నంతలో ఓకే అనిపిస్తూ 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా రెండో రోజున సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సినిమా డీసెంట్ టు గుడ్ రేంజ్ లో హోల్డ్ చేసింది అని చెప్పడానికి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండో రోజు కూడా అందుకోవాల్సి ఉంటుంది.

మరి సినిమా ప్రస్తుతానికి అది కొంచం కష్టంగా కనిపిస్తున్నా మాస్ సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచం జోరు ఎక్కువగా చూపిస్తే షేర్ లెక్క కొంచం పెరగవచ్చు. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here