బాక్స్ ఆఫీస్ దగ్గర విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి రిమార్కబుల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయింది. మార్చ్ నెల…ఒక పక్క పరీక్షల టైం ఉన్నా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఊహకందని రాంపెజ్ ను చూపించింది అని చెప్పాలి…2 కోట్ల కి పైగా అనుకున్నా ఏకంగా 2.9 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని ఊచకోత కోయడం విశేషం కాగా…రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్ల ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు మొదటి రోజు కి ఏమాత్రం తీసిపోని విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం కాగా…ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా సూపర్బ్ ట్రెండ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉండగా…
ఓవరాల్ గా సినిమా రెండో రోజు ఓపెనింగ్స్ ను బట్టి మరోసారి 2 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…ఈవినింగ్ అండ్ నైట్ షోలకు గ్రోత్ అనుకున్న రేంజ్ లో ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసి సాలిడ్ లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక డే 2 ఎండ్ అయ్యే టైంకి ఈ అంచనాలను ఎంతవరకు మించిపోతుందో చూడాలి.