బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా…బాక్ టు బాక్ హిట్స్ తో యమ జోరు మీద ఉండటంతో ఆ క్రేజ్ పవర్ ఈ సినిమా కి సెన్సేషనల్ ఓపెనింగ్స్ రావడానికి హెల్ప్ అయింది…
ఇక రెండో రోజున సినిమా కి భోగి పండగ అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో డీసెంట్ హోల్డ్ ఉంది…
మొత్తం మీద మొదటి రోజున హైర్స్ ని తీసేస్తే వచ్చిన వర్త్ షేర్ తో పోల్చితే రెండో రోజు ఆల్ మోస్ట్ 50-55% రేంజ్ లోనే డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా, ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు సూపర్ సాలిడ్ గా సాగుతూ ఉండటంతో కలెక్షన్స్ పరంగా సినిమా…
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 8-9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అలాగే మాస్ సెంటర్స్ లో పెర్ఫార్మెన్స్ అంచనాలను కనుక మించి పోతే డబుల్ డిజిట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక వరల్డ్ వైడ్ గా కూడా…
సినిమా 11-12 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని ఓవరాల్ గా అందుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉండటంతో రెండో రోజు ఓవరాల్ గా బాలయ్య ఎపిక్ మాస్ తావడం చూపెడుతున్నాడు అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర…సినిమా ఇక ఈ లాంగ్ వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఉంది…ఇక టోటల్ గా 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు…