బాక్స్ ఆఫీస్ దగ్గర మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) మొదటి రోజు ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. సినిమా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయింది. ఇక మొదటి రోజు అన్ని చోట్లా మాస్ ఊచకోత కోసిన తర్వాత రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం…
అన్ని సినిమాల మాదిరిగానే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ కనిపించడం కామనే…అది కూడా వైడ్ రేంజ్ లో రిలీజ్ ఉండటంతో మరీ ఫుల్స్ పడవు కానీ ఓవరాల్ ఆక్యుపెన్సీ అండ్ వాల్క్ ఇన్స్ ఉంటాయి…ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుతో పోల్చితే డ్రాప్స్ ఉన్నా కూడా ఉన్నంతలో బాగానే హోల్డ్ చేస్తో దూసుకు పోతుంది.
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అటూ ఇటూగా 15-16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి సినిమా గ్రోత్ ను చూపిస్తే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.. ఇక సినిమా కర్ణాటకలో రెండో రోజు మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండగా…
హిందీలో మొదటి రోజు మీద బెటర్ ట్రెండ్ కనిపిస్తుంది…ఇక తమిళ్ అండ్ కేరళలో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ఉండటంతో రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ ఓవర్సీస్ లో కూడా బాగానే జోరు చూపించే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా 25 కోట్లకు పైగా షేర్ ని మినిమమ్ వసూల్ చేసే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి..
అలాగే ఇతర భాషల్లో నైట్ షోల జోరుని బట్టి కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు ముందుకు వెళతాయి అనేది చెప్పగలం. ఓవరాల్ గా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఓవరాల్ గా డే 2 ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు…