బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి మాస్ రచ్చ చేసిన సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా, ఊహకందని కలెక్షన్స్ తో అల్టిమేట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది..
మలయాళ ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నెలకొల్పిన రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం లేనట్టే…ఇక రెండో రోజులో అడుగు పెట్టిన ఈ సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా…మరోసారి మేజర్ గా…
కేరళ మరియు ఓవర్సీస్ లో సెన్సేషనల్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా కర్ణాటకలో కూడా మంచి హోల్డ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రెండు కొత్త సినిమాల మధ్య ఈ సినిమా డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకోగా…
60-70 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉండగా కేరళలో ఈ రోజు మరోసారి డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతున్న సినిమా అన్ని చోట్లా లెక్కలు బాగుంటే 10 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
ఇక తమిళ్ అండ్ కర్ణాటకలో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో మరోసారి రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో రెండో రోజు వరల్డ్ వైడ్ గా 30-32 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి…
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఎంతైనా ఉంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర లూసిఫర్ 2 మూవీ టాక్ కి అతీతంగా మాస్ రచ్చ చేస్తూ ఉండగా వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని సినిమా రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.