మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యి రెండో రోజులో అడుగు పెట్టగా సినిమా మరోసారి ట్రాక్ చేసిన సెంటర్స్ లో…
ఏమాత్రం సినిమా సాధించిన బిజినెస్ కి న్యాయం చేసేలా అయితే హోల్డ్ ని చూపించడం లేదు అని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో భారీ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం కూడా ఉండగా మొత్తం మీద సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ లో మొదటి రోజుతో పోల్చితే 35-40% రేంజ్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…
డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉండగా ఈ లెక్కన సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.1కోట్ల రేంజ్ నుండి 2.2కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు మించితే ఈ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉండగా సినిమా సాధించిన బిజినెస్ దృశ్యా సినిమా…
రెండో రోజు మినిమమ్ 5 కోట్లకు పైగానే షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి సినిమా 2వ రోజు వరల్డ్ వైడ్ గా 2.6-2.8 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది… మొత్తం మీద సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇప్పుడు….
రిమార్కబుల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఇక టోటల్ గా సినిమా 2 రోజులకు గాను సాధించే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఈ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి ఇప్పుడు.