బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయింది. కానీ వచ్చిన మిక్సుడ్ టాక్ దృశ్యా మంచి ఓపెనింగ్స్ నే అందుకుంది కానీ మేకర్స్ రిలీజ్ చేసిన కలెక్షన్స్ పోస్టర్ నేషనల్ వైడ్ గా భారీ ట్రోల్ స్టఫ్ గా మారింది…
అయినా ఈ ఇంపాక్ట్ ఏమి కూడా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించలేదు….హిందీ లో సినిమా మంచి హోల్డ్ ని చూపించగా తెలుగు లో ఏ పెద్ద సినిమాకి అయినా రెండో రోజు ఉన్నట్లే డ్రాప్స్ ఈ సినిమాకి కూడా ఉన్నాయి….ఓవరాల్ గా మొదటి రోజు హైర్స్ ని తీసేస్తే వచ్చిన షేర్ నుండి ఆల్ మోస్ట్ రెండో రోజు డ్రాప్స్ 65% రేంజ్ లో ఉన్నాయి…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ డ్రాప్స్ ఉండగా, ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజున 10-11 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది…ఇక కర్ణాటక తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఓవరాల్ గా 2-2.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఇక హిందీలో మొదటి రోజుకి ఈక్వల్ గా బుకింగ్స్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి తర్వాత గ్రోత్ ని కూడా చూపెడుతూ దూసుకు పోతూ ఉండటంతో రెండో రోజు అక్కడ సినిమా 9-10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాస్ సెంటర్స్ లో ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే అందుకునే అవకాశం ఉంది…
ఇక ఓవర్సీస్ లో మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించ లేక పోతున్న సినిమా హాల్ఫ్ మిలియన్ డాలర్స్ ను వసూల్ చేసే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా రెండో రోజు వరల్డ్ వైడ్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా 17-19 కోట్ల రేంజ్ లో షేర్ ని….
సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు….సినిమా కి ఇక పోటిగా ఇతర సంక్రాంతి సినిమాలు 3వ రోజు నుండి రిలీజ్ కానున్న నేపధ్యంలో గేమ్ చేంజర్ మూవీ ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి…ఇక టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి….
Game changer second day collections petra