బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సారంగపాణి జాతకం(Sarangapani Jathakam Movie)-జింఖానా(Alappuzha Gymkhana) సినిమాలు రెండూ కూడా ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా యూత్ ని జింఖానా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను సారంగపాణి జాతకం సినిమా…
పర్వాలేదు అనిపించే రేంజ్ లో థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండగా…మొదటి రోజు రెండు సినిమాలో యావరేజ్ రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా రెండో రోజు రెండు సినిమాల్లో జింఖానా సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను…
చూపెడుతూ ఉండగా సారంగపాణి జాతకం కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ నుండి 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 80 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక జింఖానా సినిమా రెండో రోజు మొదటి రోజు కన్నా కూడా కొంచం లైట్ గగా గ్రోత్ ని చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో…
80 లక్షల రేంజ్ నుండి ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరగవచ్చు. ఇక ఓవరాల్ గా రెండు సినిమాల 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.