Home న్యూస్ 2nd DAY హిట్3 మూవీ ఓపెనింగ్స్…ఊచకోత ఇది!!

2nd DAY హిట్3 మూవీ ఓపెనింగ్స్…ఊచకోత ఇది!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున అనుకున్న అంచనాలను మించి పోయే రేంజ్ లో వసూళ్ళ జాతర సృష్టించిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా, అన్ని చోట్లా మాస్ కుమ్ముడు కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో దసరా తర్వాత ప్లేస్ లో జోరు చూపించిన ఈ సినిమా..

తెలుగు రాష్ట్రాల ఆవల మాత్రం దసరాని మించి పోయే రేంజ్ లో దుమ్ము దుమారం లేపింది. ఇక మొదటి రోజున వీర బాదుడు బాదిన తర్వాత రెండో రోజున నార్మల్ ఫ్రై డే అవ్వడంతో డ్రాప్స్ ను కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంటుంది ఏమో అని అనిపించినా కూడా..

మొదటి రోజున టికెట్ సేల్స్ లో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు చూసుకుంటే కేవలం 40-45% రేంజ్ లోనే డ్రాప్స్ అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి, ఆఫ్ లైన్ లో కూడా ఇదే రేంజ్ లో ట్రెండ్ ఉండే అవకాశం ఉండగా…. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు..

సినిమా కొంచం గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ నాని నటించిన దసరా సినిమా డే 2 రేంజ్ లోనే ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే రెండో రోజున..

తెలుగు రాష్ట్రాల్లో 5-5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు గ్రోత్ ను అనుకున్న రేంజ్ లో చూపిస్తే ఈ లెక్క 6 కోట్లు ఆ పైన వెళ్ళే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా కూడా…

సినిమా మంచి జోరుని చూపెడుతూ ఉండటంతో రెండో రోజు వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరుని చూపించే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా నార్మల్ డే లోనే ఇలాంటి హోల్డ్ ని చూపిస్తే ఇక శని ఆదివారాల్లో మరింత రచ్చ లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక డే 2 ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.

NANI Hit3 Movie WW Pre Release Business!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here